TSPSC : గ్రూప్-1, ఇతర అభ్యర్థులకు అలర్ట్.. ఎన్నికల తర్వాతే కీలక నిర్ణయాలు?

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, ఇతర నియామక పరీక్షలకు సంబంధించి అప్డేట్స్ రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయా నియామక సంస్థలు ఈ పరీక్షల విషయంలో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

TSPSC : గ్రూప్-1, ఇతర అభ్యర్థులకు అలర్ట్.. ఎన్నికల తర్వాతే కీలక నిర్ణయాలు?
New Update

TSPSC Exams Update: తెలంగాణలో టీఎస్పీఎస్సీ (TSPSC) లీకేజీల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్రూప్-1 (Group 1) పరీక్షను ఒక సారి కమిషన్ రద్దు చేయగా.. మరో సారి హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ముందుగానే దీనిపై టీఎస్ పీఎస్సీ సుప్రింకోర్టుకు వెళుతుందని అంతా భావించారు. ఆ దిశగానే ప్రయత్నాలు జరిగినప్పటికీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల కారణంగా ఇది వాయిదా పడింది. దీంతో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతే దీనిపై పూర్తి నిర్ణయం తీసుకునే అవాకాశం ఉంది. ఒకవేళ గ్రూప్ 1 పరీక్షలో లొసుగులున్నట్లు సుప్రిం కోర్టు తీర్పు వెల్లడిస్తే గ్రూప్ 4 (TSPSC Group 4) కూడా పరిశీలనలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే టీఎస్ పీఎస్సీ లో తప్పులు జరిగాయని, ప్రక్షాళన చేయాల్సివుందని మంత్రి కేటీఆర్ స్వయంగా ఒప్పుకోవడం విశేషం. కాగా పలు ఇంటర్వ్యూలో హరీష్ రావు సైతం అవకతవకలు జరిగినట్లు అంగీకరించారు.

ఇది కూడా చదవండి: c-VIGIL APP: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి!

అయితే తాజా సమాచారం ప్రకారం కొత్త గవర్నమెంట్ ఏర్పడేదాకా ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇటీవలే కేటీఆర్ (KTR) మాట్లాడుతూ డిసెంబర్ 3 తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడగానే తానే స్వయంగా బాధ్యత వహిస్తానని మాటిచ్చాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి సైతం తమ గవర్నమెంట్ లోనే టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చెపడతామని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇక బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడగానే పూర్తి ప్రక్షాళన చేసి ఒక క్రమ పద్ధతిలో ఉద్యోగనియమాకాలు చేపడతామన్నారు. మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ తర్వాతే దీనిపై దృష్టిపెట్టబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఇప్పట్లో దీనిపై ఎలాంటి అప్ డేట్ వెలువడే అవకాశం లేదు.

ఇదిలావుంటే ఎన్నిక‌ల దృష్ట్యా డీఎస్సీని కూడా వాయిదా వేస్తున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ శ్రీదేవ‌సేన తెలిపిన సంగతి తెలిసిందే. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భ‌ర్తీ కోసం డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 20 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గాల్సిన స్కూల్ అసిస్టెంట్, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, భాషా పండిట్లు, ఎస్జీటీ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. న‌వంబ‌ర్ 30వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఎస్‌జీటీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భ‌ర్తీ చేయనుండగా ఎలక్షన్ కోడ్ వెలువడటంతో డీఎస్సీ తదితరా పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో అభ్యర్థులు ఎంతో ఆసక్తితో పరీక్షలకు సన్నద్ధమైనప్పటికీ ఎన్నికల కారణంగా చాలా నిరాశలో కూరుకుపోయారు. అలాగే గ్రూప్ 2  (TSPSC Group 2) పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి.

ఇక గ్రూప్ 1 పరీక్షల్లో నిందితులు ప్రశాంత్‌, నవీన్‌, మహేష్‌ ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. ఏఈఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడిన ముగ్గురిని తాజాగా అరెస్టు చేశారు. డీఈ రమేష్‌ ద్వారా ఏఈఆ పేపర్‌ను కొనుగోలు చేసిన ఈ ముగ్గురు నిందితులు.. ఎలక్ట్రానిక్ డివైజ్ ఉపయోగించి పరీక్ష రాసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో 45 మందిని సిట్ అరెస్ట్ చేసింది. వారిలో కొంతమంది బెయిల్‌పై జైలు నుంచి బయటకొచ్చారు. ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసు దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చినా.. రోజుకో కొత్త కోణం బయటపడుతూ వస్తోంది. దీంతో సిట్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

#tspsc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe