TSPSC : 18 నుంచి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్.. మరో ఛాన్స్ ఉండదన్న టీఎస్పీఎస్సీ

ఏఈఈ నియామకాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో హాజరుకాని వారికి మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది.

Group-1: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
New Update

TSPSC : గతేడాది మేలో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) నియామక పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ(TSPSC) కీలక ప్రకటన చేసింది. 1:2 నిష్పత్తి అభ్యర్థుల జాబితాలో ఉన్న వారికి ఈ నెల 18 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆయా అభ్యర్థులు చెక్ లిస్ట్ లో పేర్కొన్న సర్టిఫికేట్లన్నీ తీసుకురావాలని సూచించింది. వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికేట్లు తీసుకురాని అభ్యర్థులకు తదుపరి సమయం ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు హాజరుకాని వారికి మళ్లీ అవకాశం ఉండదని అధికారులు తేల్చిచెప్పారు. 1:2 లో ఉన్న అభ్యర్థులు హైదరాబాద్ కూకట్ పల్లిలోని జేఎన్టీయూ(JNTUH) కూకట్ పల్లిలోని అడ్మిషన్ బ్లాక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే? 

వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి 2022 సెప్టెంటర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కు సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ నియామకాలకు సంబంధించి 2023 జనవరి 22న పరీక్ష నిర్వహించారు. అయితే.. పేపర్ లీక్ అయిందని బయటపడడంతో టీఎస్పీఎస్సీ పరీక్షను రద్దు చేసింది.

అనంతరం పరీక్షను గతేడాది మే 8,9, 21,22 తేదీల్లో నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ లో విభాగాల వారీగా మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి తేదీలను ప్రకటించారు. అనంతరం ఎంపికైన వారి జాబితాను విడుదల చేసి నియామక పత్రాలను అందించనున్నారు.

#telangana-government-jobs #tspsc-group-1 #tspsc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe