నేడు TSPSC గ్రూప్-4 పరీక్ష, అభ్యర్థులు ఈ రూల్స్ పాటించాల్సిందే..!! రాష్ట్రవ్యాప్తంగా నేడు TSPSC గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు.ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సూచించింది. కాగా ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2, 878కేంద్రాలను ఏర్పాటు చేశారు. By Bhoomi 01 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,878కేంద్రాలను ఏర్పాటు చేసింది. రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు పేపర్ -1 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని...పరీక్షకు 15నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారని టీఎస్పీఎస్సీ సూచించింది. ఉదయం జరిగే పేపర్ -1 పరీక్షకు 8.30గంటల నుంచి 9.45 గంటల వరకు పేపర్ -2 మధ్యాహ్నం 1.00 నుంచి 2.15 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. సమయం దాటినట్లయితే ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రంలోని అనుమతింబోమని స్పష్టం చేశారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. అటు పేపర్ లీకేజీ విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలక చర్యలు చేపట్టింది టీఎస్పీఎస్సీ. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్దుతల్లో తనిఖీ చేయాలని నిర్ణయించింది. బయోమెట్రిక్ విధానం ఉండగా...ఈ సారి థంబ్ విధానాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రతీ పరీక్షాకేంద్రంలో ఈ థంబ్ యాంత్రాలను ఏర్పాటు చేసి..వేలి ముద్రాలు తీసుకుంటారు. ఈ రూల్స్ అన్ని పాటించాలి కాబట్టి అభ్యర్థులు రెండుగంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. కీలక సూచనలు చేసిన టీఎస్పీఎస్సీ: - పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూస్తారు. నిర్ణిత సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. -అభ్యర్థులు హాల్ టికెట్ తోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి. -ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రిమోట్ కలిగిన కారు తాళాలు, నిషేధిత వస్తువులను అనుమతించరు. -అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి హాజరైనట్లు గుర్తిస్తే...వారిపై పోలీసు కేసు నమోదు చేస్తారు. ఆ పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు. -థంబ్ తప్పనిసరి. ప్రతిసెషన్ పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలెటర్ కు అందజేయాలి. -బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్ , జెల్ పెన్ , పెన్సిల్ ఉపయోగించినట్లయితే ఓఎంఆర్ షిట్స్ ను చెల్లుబాటు కానివిగా ప్రకటిస్తారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి