TS RTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే వారికోసం ప్రతి 10 నిమిషాలకు ఒక (TSRTC) బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
ఈ మేరకు 'ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించండి' అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ షేర్ చేశారు.