TS RTC: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్!

హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించేవారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను నడుపుతుండగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ కల్పించింది.

New Update
TS RTC: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్!

TS RTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే వారికోసం ప్రతి 10 నిమిషాలకు ఒక (TSRTC) బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ఈ మేరకు 'ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించండి' అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ షేర్ చేశారు.

Advertisment
తాజా కథనాలు