TS Politics: షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో విలీనం అవుతున్నట్లు నేతల ప్రకటన! కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న వైఎస్ షర్మిలకు వైఎస్సార్టీపీ నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. గట్టు రామచంద్రారావు ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ సమక్షంలో 40కి పైగా ముఖ్య నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. By Nikhil 13 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు ఆ పార్టీ ముఖ్యనేతలు షాక్ ఇచ్చారు. గట్టు రామచంద్రరావుతో సహా దాదాపు 40 మంది వివిధ నియోజకవర్గాల, జిల్లాల కో-ఆర్టినేటర్లు, ముఖ్య నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రారావు మాట్లాడుతూ.. తాము బీఆర్ఎస్ లో చేరడం లేదని.. వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నామన్నారు. నేడో, రేపు ఆ పార్టీలో మిగిలిన నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరుతారన్నారు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఓ మహిళా నేతకు సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఆ పార్టీలో చేరామన్నారు. కానీ తమ నమ్మకాలను వమ్ము చేస్తూ షర్మిల ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల తమను అనేక సార్లు అవమానించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించడానికి కృషి చేస్తామన్నారు. తమ అందరికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్ రావును కోరారు. Live: మంత్రి శ్రీ @BRSHarish గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమం #KCROnceAgain #VoteForCar https://t.co/SoSgyS91bI — BRS Party (@BRSparty) November 13, 2023 #brs #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి