TS Nirudyoga Bruthi: నిరుద్యోగులకు అలర్ట్.. భృతి పొందాలంటే అర్హతలివే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అదే సమయంలో నిరుద్యోగులకు భృతి కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఇందుకోసం నియమ నిబంధనలు రూపొందిస్తున్నారు.

TS Nirudyoga Bruthi: నిరుద్యోగులకు అలర్ట్.. భృతి పొందాలంటే అర్హతలివే..!
New Update

TS Nirudyoga Bruthi: తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల వేళ తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉద్యోగ ప్రకటన ఇచ్చేంత వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డే అవడంతో.. యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తారా? నిరుద్యోగ భృతి ఇస్తారా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగ ప్రకటన ఇచ్చేంత వరకు నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని పేర్కొంది. దీంతో నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేస్తుంది? ఎప్పుడు విడుదల చేస్తుంది? అర్హతలేంటి? అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. అయితే, ప్రభుత్వం సైతం నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. నిరుద్యోగ భృతి కోసం నియమ నిబంధనలు కూడా రూపొందించే పనిలో నిమగ్నై ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నిరుద్యోగ భృతి పొందాలంటే సదరు వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆ ఆర్హతలు ఉన్న వారికే ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించనుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం అర్హతలివే..

నిరుద్యోగి తెలంగాణలో పుట్టిన వారై ఉండాలి

దరఖాస్తు చేసే టైంలో నిరుద్యోగై ఉండాలి

గ్రాడ్యూయేషన్‌, డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోగిగా ఉండాలి

జిల్లాలో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో నమోదై ఉండాలి

కాగా, నిరుద్యోగ భృతి అంశాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రధానంశంగా ప్రస్తావించారు. టీఎస్‌పీఎస్‌సీలో దాదాపు 42 లక్షల మంది నిరుద్యోగులుగా రిజిస్టర్ చేసుకున్నారు. వీరందరికీ నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలంటే నెలకు రూ. 1200 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే.. నిరుద్యోగ భృతి కోసం దాదాపు రూ. 14 వేల కోట్లు అవసరం పడుతుంది.

ఇక్కడో ట్విస్ట్..

అయితే, ఈ హామీ విషయంలో చిన్న ట్విస్ట్ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ తన ఆరు గ్యారెంటీల్లో నిరుద్యోగ భృతిని చేర్చలేదు. ఈ ఆరు గ్యారెంటీలకు అదనంగా ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతిని చేర్చింది కాంగ్రెస్. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే వరకు డిసెంబర్ 9వ తేదీ నుంచే నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామని పేర్కొంది. అంతేకాదు.. పలు సభల్లో కూడా రేవంత్ రెడ్డి సహా పార్టీ కీలక నేతలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. దాంతో ఇప్పుడు తెలంగాణలోని నిరుద్యోగులంతా ఈ భృతి కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read:

సీఎం ఆఫర్‌పై స్పందించిన నళిని.. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన..

హైదరాబాద్‌లో భారీ పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు..

#telangana-news #telangana-govt-jobs #ts-nirudyoga-bruthi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe