/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-Polling-1-1.jpg)
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 35,809 పోలింగ్ బూత్ లను ఏర్పాటే చేసింది ఈసీ. 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3,896 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేశారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ బరిలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 12 మంది పోటీలో ఉన్నారు.
తెలంగాణలో మొత్తం ఓటర్లు:3,32,32,318
పురుషులు: 1,65,28,366
ఇతరులు: 2,760
సర్వీస్ ఓటర్లు: 15,338