TS ECET & LAWCET 2024: టీఎస్‌ ఈ సెట్, లా సెట్ షెడ్యూల్ విడుదల

టీఎస్‌ ఈ సెట్, లా సెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది విద్యామండలి. మే 6న టీఎస్ ఈ సెట్, జూన్ 3వ తేదీన ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం పరీక్షల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

New Update
Telangana : రాష్ట్రంలో నేటి నుంచి పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

TS ECET & LAWCET 2024: టీఎస్‌ ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు పేర్కొంది. లేట్ ఫీజ్‌తో కలిపి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి 28 వరకు అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది.
Website: https://ecet.tsche.ac.in/

లా సెట్ షెడ్యూల్...

లా సెట్ షెడ్యూల్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఫిబ్రవరి 28న పీజీ ఎల్ సెట్, లా సెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేయనున్నట్లు తెలిపింది. జూన్ 3వ తేదీన ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం పరీక్షల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Website: https://lawcet.tsche.ac.in/

TS EAMCET: తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది. 

ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు..

* మే 6న తెలంగాణ ఈసెట్
* మే 23న ఎడ్ సెట్
* జూన్‌ 3న లాసెట్‌, పీజీ లాసెట్‌

Also Read: గ్రూప్​-1 వయోపరిమితి పెంపు

Advertisment
తాజా కథనాలు