TS Inter Exams 2023: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్ష రద్దు..!! తెలంగాణలో ఇంటర్ చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్ బోర్డు. పరీక్షల సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. By Bhoomi 26 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షరద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సెబ్జెక్టుల్లో వీలినం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మరో ఇంటర్నల్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఎప్పటిలాగే యథాతథంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 100మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి..అదే కళాశాల లెక్చరర్లు మూల్యాంకనం చేసి మార్కులు ఇస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా ,ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో యాడ్ చేయరు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరంలో ప్రాక్టికల్స్ అమలు చేయడంతోపాటు థియరీకి, ప్రాక్టికల్స్ కు వేరు వేరుగా పాఠ్య పుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లీష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాంగా ఉండటంతో ప్రత్యేక పరీక్ష అవసరం లేదని అధికారులు భావించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే? ఇక ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షకు 20 మార్కులు కేటాయిస్తారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా వంద మార్కులకు కాకుండా 80 మార్కులను నిర్వహిస్తారు. థియరీలో మార్కులు తగ్గినందుకు ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్ ను తగ్గించారు. ఇది కూడా చదవండి: NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో ‘ఇండియా’ పేరు ఉండదు..! #ts-inter-exams-2023 #inter-board-exam-reforms #inter-examination-reforms #inter-internal-exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి