అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ (Danam Nagender).. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆ కొన్ని రోజులకే దానంను తమ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదే పాయింట్ తో ఇప్పుడు రాజు యాదవ్ అనే వ్యక్తి దానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆ వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లుగా గుర్తించి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరాడు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే!
ఈ మేరకు స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికే ఈ విషయమై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. నిన్న కేటీఆర్ సైతం ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానంను ప్రకటించడంతో ఆయనను స్పీకర్ అనర్హుడిగా గుర్తించాలని కోరారు.
ఈ విషయంపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజకీయ ఒత్తిడితో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్లి.. న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరికొన్ని నెలల్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు.