Danam Nagender: దానం నాగేందర్ కు షాక్.. రేపే హైకోర్టులో విచారణ? కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేయడం చట్ట విరుద్ధమని, రాజ్యంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. By Nikhil 27 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ (Danam Nagender).. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆ కొన్ని రోజులకే దానంను తమ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదే పాయింట్ తో ఇప్పుడు రాజు యాదవ్ అనే వ్యక్తి దానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆ వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లుగా గుర్తించి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరాడు. ఇది కూడా చదవండి: Revanth Reddy: జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే! ఈ మేరకు స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికే ఈ విషయమై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. నిన్న కేటీఆర్ సైతం ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానంను ప్రకటించడంతో ఆయనను స్పీకర్ అనర్హుడిగా గుర్తించాలని కోరారు. రానున్న మూడు నాలుగు నెలల్లో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రాబోతుంది.. ఖైరతాబాద్ ఓటర్లు సిద్ధంగా ఉండండి పార్టీ మారిన దానం నాగేందర్‌ను అనర్హుడిగా స్పీకర్ ప్రకటించాలి.. రాజకీయ ఒత్తిడులకు లోబడి స్పీకర్ ప్రకటించకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తాము కానీ దానం నాగేందర్‌ను వదలం - బీఆర్ఎస్… pic.twitter.com/POo8mXFquK — Telugu Scribe (@TeluguScribe) March 26, 2024 ఈ విషయంపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజకీయ ఒత్తిడితో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్లి.. న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరికొన్ని నెలల్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. #ktr #mla-danam-nagender #brs-mla-joins-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి