రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసినట్లు సర్కార్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.99,999 లోపు ఉన్న రుణాలను బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. దీంతో రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 9లక్షల 2వేల 843 మంది రైతులకు సంబంధించి రూ.5809.78 కోట్లు బ్యాంకులకు జమ అయ్యాయి.
పూర్తిగా చదవండి..తెలంగాణ రైతులకు తీపి కబురు.. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ
తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 9లక్షల 2వేల 843 మంది రైతులకు సంబంధించి రూ.5809.78 కోట్లు బ్యాంకులకు జమ అయ్యాయి.
Translate this News: