TS Incharge Ministers: జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించిన రేవంత్.. ఖమ్మంకు కోమటిరెడ్డి, కరీంనగర్ కు ఉత్తమ్.. పూర్తి లిస్ట్ ఇదే! ఆరు గ్యారంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో సౌలభ్యం, హామీల అమలు కోసం రాష్ట్రంలోని పూర్వ 10 జిల్లాలకు ఇందుకోసం ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమించింది. By Naren Kumar 24 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి TS Incharge Ministers: ఆరు గ్యారంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో సౌలభ్యం, హామీల అమలు కోసం రాష్ట్రంలోని పూర్వ 10 జిల్లాలకు ఇందుకోసం ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమించింది. ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు ఆయా జిల్లాల్లో వీరి ఆధ్వర్యంలోనే జరగనుంది. సాధారణంగా కాంగ్రెస్ లో ఇన్‌చార్జి మంత్రికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయం చర్చనీయమవుతోంది. ఆదివారం అధికారులతో సీఎం రేవంత్ విస్తృత సమీక్ష నిర్వహించగా.. ఏడుగురు సివిల్ సర్వెంట్లను బదిలీ చేస్తూ సీఎస్ సాయంత్రం ఆదేశాలు జారీచేశారు. మరికాసేపటికే ప్రజాపాలన నిర్వహణ కోసం మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఇన్చార్జి మంత్రుల జాబితా: కరీంనగర్ - ఉత్తమ్‌కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ - మహబూబ్‌నగర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి - ఖమ్మం దుద్దిళ్ల శ్రీధర్ బాబు - రంగారెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - వరంగల్ పొన్నం ప్రభాకర్ - హైదరాబాద్ కొండా సురేఖ - మెదక్ సీతక్క - ఆదిలాబాద్ తుమ్మల నాగేశ్వరరావు - నల్గొండ జూపల్లి కృష్టారావు - నిజామాబాద్ #ts-incharge-ministers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి