TS Government: వారికి రూ.లక్షతో పాటు తులం బంగారం.. రూ.725 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్! కల్యాణలక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం రూ.725 కోట్లను విడుదల చేసింది. అయితే.. ఈ పథకం అమలుకు ఏ తేదీని ప్రమాణికంగా తీసుకుంటారు? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. By Nikhil 19 May 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కల్యాణలక్ష్మి స్కీమ్ కింద గత ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్షతో పాటు తులం బంగారం సైతం ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావొస్తున్నా ఈ హామీని నెరవేర్చకపోవడంతో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ హామీని అమలు చేయాలని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.725 కోట్లను మంజూరు చేసింది. ఈ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను కేటాయించింది రేవంత్ సర్కార్. దీంతో నెలలుగా పెండింగ్ లో ఉన్న కల్యాణ లక్ష్మి అప్లికేషన్లను అధికారులు క్లీయర్ చేయనున్నారు. ఇది కూడా చదవండి: TS Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే? ఈ దరఖాస్తు దారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. తులం బంగారం ఇవ్వడం అమలుకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రమాణికంగా తీసుకుంటారు? అన్న అంశంపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7ను తీసుకుంటారా? లేక అంతకు ముందు ఏదైనా తేదీని తీసుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9ని కటాఫ్ డేట్ గా తీసుకోవాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. అయితే.. కల్యాణ లక్ష్మి స్కీమ్ లో అదనంగా తులం ఇవ్వడానికి కూడా అదే తేదీని ప్రమాణికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. వచ్చే మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి