TS Elections: కాంగ్రెస్ కు గుడ్ లక్.. త్వరలోనే పుంజుకుంటాం: కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన త్వరలోనే తాము తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు.

TS Elections: కాంగ్రెస్ కు గుడ్ లక్.. త్వరలోనే పుంజుకుంటాం: కేటీఆర్ ట్వీట్
New Update

KTR: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందించారు. "వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో మాకు అవకాశమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల అనూహ్య ఫలితాలపై బాధపడడం లేదు; గానీ కొంత నిరాశ కలిగించాయి. దీన్ని ఒక పాఠంగా తీసుకుని త్వరలోనే పుంజుకుంటాం. ప్రజల విశ్వాసాన్ని పొందిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు" అని ట్వీట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. మరో సంచలన నిర్ణయం

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ ఫలితాలకు ఒకరోజు ముందు కూడా తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం కూడా తుపాకీ ఎక్కుపెట్టిన ఫొటో ట్వీట్‌ చేసిన కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్య ఫలితాలు రావడం తమను కాస్త నిరుత్సాహపరిచిందని; కానీ త్వరలోనే తిరిగి పుంజుకుంటామని ట్వీట్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు.

#telangana-elections #ktr-on-twitter
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe