TS Elections 2023: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలు మొదలయ్యాయి

తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ఏ ఒక్క ఓటునూ వదులుకోవడానికి సిద్ధంగా లేని అభ్యర్థులు భారీ ఖర్చులకూ వెనుకాడడం లేదు. ముఖ్యంగా కులసంఘాలు, మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

New Update
TS Elections 2023: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలు మొదలయ్యాయి

Telangana Elections 2023: ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కాళ్లకు చక్రాలు కట్టుకుని పరుగులు పెట్టిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల జోరుకు మంగళవారం సాయంత్రానికి బ్రేక్ పడింది. చివరిరోజు కూడా బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తించినవారు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రచారానికి గడువు ముగియడంతో తెరవెనుక వ్యవహారాలను నడిపించడంలో ఇప్పుడు నాయకులంతా బిజీ అయిపోయారు.

ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో పోలింగ్.. సీఈవో వికాస్ రాజ్ సంచలన ప్రకటన

రాష్ట్రమంతటా ఇప్పుడు ఒకే పరిస్థితి.. అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీలదీ అదే బాట.. ప్రచారం ముగిసిన వేళ ప్రలోభాలకు తెరతీశారు. ప్రతీ ఓటునూ అత్యంత కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే ఐదేళ్ల కాలానికి కీలకమైన ఈ రెండు రోజుల్లో ప్రతీ క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావించి ఓటర్లను ఆకట్టుకునేలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంపకాల పర్వం ఇప్పటికే మొదలవగా, అన్ని పార్టీల నాయకులు ఓటర్లకు భారీగా మద్యం, డబ్బు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఓటర్లు చేజారిపోకుండా అభ్యర్థులంతా భారీ ఖర్చులకు కూడా వెనుకాడడం లేదు.

ఇది కూడా చదవండి: నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే.. ఈసీ హెచ్చరిక

కులసంఘాలు, మహిళా, యువజన సంఘాలపై ఫోకస్:
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కులసంఘాలపై దృష్టిసారించాయి. బలమైన అభ్యర్థులే దాదాపు అంతటా పోటీలో ఉండడంతో ఒకట్రెండు చోట్లు మినహా ఎక్కడా ఏకపక్ష పోరుకు దాదాపుగా అవకాశం లేదు. బొటాబొటీ మెజార్టీతోనే గట్టెక్కాల్సి ఉంటుందని భావిస్తున్న అభ్యర్థులు ఏ ఒక్క ఓటునూ తేలికగా తీసిపడేయడానికి సిద్ధపడడం లేదు. మంగ‌ళ‌వారం రాత్రి నుంచే వివిధ కులసంఘాలతో బేటీలు మొదలుపెట్టారు. గంపగుత్తగా ఓట్లు వేయించుకునేలా ఆయా సంఘాలపై హామీలు కురిపిస్తున్నారు. మరోవైపు యువజన సంఘాలు, మహిళా సంఘాలను కూడా తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్ల సంఖ్యను బట్టి ఏకమొత్తంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు పోటీలు పడుతున్నాయి. మద్యం, డబ్బుల పంపకాల సమయంలో పోలీసులు, ఇతర ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు చిక్కకుండా ఉండేందకు పకబ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దగ్గరివారు, నమ్మకస్తులను ఈ పనుల కోసం నియమించుకుని సైలెంట్ గా పనిపూర్తి చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు