తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ 65 కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఐదు లోపు, ఎంఐఎం 5 స్థానాలను సాధించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత ట్రెండ్స్ ను పరిశీలిస్తే అర్థం అవుతోంది. దీంతో హంగ్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించడానికి ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: తెలంగాణలో దుమ్ములేపుతున్న కాంగ్రెస్. . ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్!
TS Congress: నో హంగ్.. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆ పార్టీ 65-70 సీట్లు సాధించడం ఖాయం కానుంది. ఈ రోజు సాయంత్రానికి గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం పార్టీ.
Translate this News: