TS Elections 2024: హైదరాబాద్ లోని ఓటర్లకు శుభవార్త.. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి..

హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా 'రాపిడో-ఈసీ' సంయుక్తంగా ఓటర్లకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ సేవలను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను పోలింగ్ బూత్ ల నుంచి వారి ఇంటికి ఉచితంగా చేర్చనుంది రాపిడో.

TS Elections 2024: హైదరాబాద్ లోని ఓటర్లకు శుభవార్త.. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి..
New Update

ఈ నెల 13న తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్.. రాపిడో కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా రాపిడో సంస్థ ఓటర్ల కోసం ఉచితంగా సేవలు ఉందించనుంది. పోలింగ్ బూత్ నుంచి ఫ్రీగా ఓటర్లను ఇంటికి చేర్చనుంది. ఇందుకోసం ఓటర్లు "VOTE NOW" ప్రోమో కోడ్ ను వినియోంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సీఈఓ వికాస్ రాజ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ అనుదీప్, రాపిడోకు చెందిన 600 మంది ట్యాక్సీ కెప్టెన్లు పాల్గొన్నారు.

మారని గ్రేటర్ వాసుల తీరు..
అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవగాహన కల్పిస్తున్న ఏళ్లుగా గ్రేటర్‌ ప్రజల తీరు మాత్రం మారడం లేదు. ఓటింగ్ శాతం 50కి దాటడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 49.03 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌ జిల్లాలో 46.56 శాతం, రంగారెడ్డి జిల్లాలో 59.94, మేడ్చల్‌ జిల్లాలో 56 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. అత్యంత విద్యావంతులు, సెలబ్రేటీలు, ధనవంతులు, ఉద్యోగులు ఉండే గ్రేటర్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం ఆందోళనకరమైన అంశమనే చెప్పాలి. ఓటింగ్ తగ్గడానికి ప్రధాన కారణం ఆ రోజును సెలవుదినంగా భావించి అనేక మంది టూర్లకు వెళ్లడమే కారణంగా చెప్పొచ్చు.

అవగాహన కల్పించినా అంతే..
మరికొందరు ఎవరు గెలిస్తే మనకేంటి అనుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే.. గ్రేటర్ లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడో ఉండడం, వాటి చిరునామా తెలియకపోవడంతో మరికొందరు పోలింగ్ కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పోలింగ్ కేంద్రానికి కొన్ని రోజుల ముందే ఓటర్ల ఇంటికి వెళ్లి పోల్ స్లిప్పులు పంపిణీ చేయడం లాంటివి చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఓటింగ్ శాతంలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు.

సక్సెస్ అవుతుందా?
ఈ క్రమంలోనే రాపిడో తో కలిసి ఓటర్లకు పోలింగ్ కేంద్రం నుంచి ఇళ్లకు ఫ్రీ రైడ్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది ఈసీ. ఈ సదుపాయాన్ని ఎంత మంది వినియోగించుకుంటారు? తద్వారా ఓటింగ్ శాతం ఏమైనా పెరగుతుందా? అన్నది తేలాలంటే ఓటింగ్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. ఈ కార్యక్రమం విజయవంతం అయితే.. ఈసీ ఇలాంటి ప్రోగ్రామ్ లను రానున్న రోజుల్లో మరికొన్నింటిని నిర్వహించే అవకాశం ఉంటుంది.

#rapido
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe