TS Elections 2023: లేచింది మహిళా లోకం.. టికెట్ల పంచాయతీ.. తలపట్టుకుంటున్న కాంగ్రెస్..! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 20 టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇంటింటి ప్రచారంలో మహిళా కాంగ్రేస్ పాల్గొనదని తేల్చిచెబుతున్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. By Trinath 07 Oct 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana assembly elections) టికెట్లు కోసం కాంగ్రెస్(Congress)లో లొల్లి మొదలైంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళా లోకం కాంగ్రెస్ హైకమాండ్‌కి పలు డిమాండ్లు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీలో టికెట్ల కోసం అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతున్నట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. మహిళల డిమాండ్‌తో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. మహిళలకు కాంగ్రెస్ 20 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు. ప్రచారంలో పాల్గొనేదిలేదు: తమకు 20 టికెట్లు ఇవ్వకపోతే ఇంటింటి ప్రచారంలో మహిళా కాంగ్రేస్ పాల్గొనదని మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు చెబుతున్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. మరోవైపు తమకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనంటున్నారు బీసీలు. ఇక తమకు 10 సీట్లు కావాలని కమ్మకులం నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు మహిళలకు 20 సీట్లు అంటూ కొత్త డిమాండ్ తెరపైకి రావడంతో హైకమాండ్‌కి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉంది. మహిళలను పార్టీ గౌరవిస్తే 20 టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. పెద్దపీట వేయండి: మహిళల ఓట్లు కావాలి కానీ మహిళలకు టిక్కెట్లనివ్వరా అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ మహిళలను ఆకర్షించేవేనని.. అందుకే టికెట్లలో మహిళలకు పెద్దపీట వేయండని డిమాండ్ చేస్తున్నారు. గెలిచే స్థానాలు ఇవ్వాలి లేదంటే ఊరుకునేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. మహిళా అధ్యక్షురాలికే ఇంతవరకు టిక్కెట్ కేటాయించలేదని నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. డిమాండ్‌ని నేరవేర్చకపోతే మహిళా కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరని చెబుతున్నారు. ఇటివలే పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైంది. ఈ బిల్లుకు MIM మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ఈ బిల్లు అమల్లోకి వచ్చేది ఇప్పుడప్పుడే కాదు. 2024 జనరల్ ఎలక్షన్స్ టైమ్‌కి ఈ చట్టాన్ని అమలు చేసే ఛాన్స్ లేదు. అయితే చిత్తశుద్ది ఉంటే.. నిజంగా మహిళలపట్ల గౌరవం ఉంటే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా పార్టీలు ప్లాన్ చేసుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మహిళా నేతలు కూడా ఇదే అంటున్నారు. ALSO READ: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు..! #ts-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి