రేపు ఎన్నికల ఫలితాలు.. డీజీపీ కీలక ఆదేశాలు!

రేపు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సీపీలు, ఎస్పీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

New Update
రేపు ఎన్నికల ఫలితాలు.. డీజీపీ కీలక ఆదేశాలు!

DGP Anjani Kumar: తెలంగాణలో ఏ పార్టీకి అధికారంలోకి రాబోతుందనేది రేపు తెలియబోతుంది. రేపు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

ALSO READ: ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

ఈరోజు సీపీలు, ఎస్పీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ అంజనీ కుమార్. రేపు జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై వారితో సమీక్షించారు డీజీపీ. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా పెట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని పేర్కొన్నారు. చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను హెచ్చరించారు.

లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమికూడనివ్వొద్దని పేర్కొన్నారు. గెలుపొందిన వాళ్లు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్య పార్టీ నేతలకు భద్రత కల్పించాలని అన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భద్రత పెంచారు పోలీస్ అధికారులు.

ALSO READ: బైబై కేసీఆర్‌.. షర్మిలా సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు