TS Elections: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే! నకిరేకల్ లో ఇటీవల కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నట్లు గమనించిన బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు చెరుకు సుధాకర్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో పాటు రేపు కేటీఆర్, 20న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. By Nikhil 13 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీలో ఉన్నారు. టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ను వీడిన వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. వీరేశంను గెలిపించడం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దిగారు. సమయం చిక్కినప్పుడల్లా వారు నకిరేకల్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. నకిరేకల్ కోమటిరెడ్డి ఫ్యామిలీ సొంత నియోజకవర్గం. గత ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలవడంలో వారు కీలక పాత్ర పోషించారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థికి వారు అన్ని విధాలుగా సహకరించారన్న టాక్ కూడా ఉంది. దీంతో ఈ సారి కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని తమ సత్తా చాటాలని వారు భావిస్తున్నారు. తమను కాదని పార్టీని వీడిన చిరుమర్తి లింగయ్యను ఓడించాలన్న లక్ష్యంతోనూ వారు ఈ నియోజకవర్గంపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Rasamayi Balakishan: రసమయి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు.. ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లిలోనూ.. అయితే.. ఈ విషయం బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో నాయకత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్, కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లు చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా రేపు కేటీఆర్ నకిరేకల్ లో పర్యటించనున్నారు. చిట్యాలలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ముఖ్యనాయకులతోనూ ఆయన సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఈ నెల 20న కేసీఆర్ బహిరంగ సభను ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్లో చెరుకు సుధాకర్ సైతం చిరుమర్తికి మద్దతుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. చెరుకు సుధాకర్ గతంలో బీఆర్ఎస్ ను వీడడానికి వేముల వీరేశం ఆ పార్టీలో చేరడమే ప్రధాన కారణమన్న చర్చ కూడా ఉంది. మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడా చెరుకు సుధాకర్ కు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి ఓటమే లక్ష్యంగా చెరుకు సుధాకర్ తీవ్రంగా ప్రచారం సాగిస్తున్నారు. తన పరిచయాలన్నింటినీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం వినియోగించేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. విషయం అధిష్టానానికి తెలియడంతో వారి వివరాలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించి వారికి నేరుగా రాష్ట్ర స్థాయి నుంచి హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. #cm-kcr #telangana-elections-2023 #komatireddy-venkat-reddy #vemula-veeresham మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి