తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చెయవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సిర్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రవీణ్ కుమార్ కేసు నమోదైంది. కొంత మంది వ్యక్తులపై దాడి చేసి డబ్బులు తీసుకున్నారంటూ కేసు ఫిర్యాదు చేశారు పోలీసులు. తనపై నమోదు అయిన కేసుపై ఆర్ఎస్పీ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సిర్పూర్ నుంచి ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, ప్రవీణ్ కుమార్ మధ్య కొన్ని రోజులుగా మాటల తూటాలు పేలుతున్నాయి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైకోర్టులో ఊరట
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిర్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో కొంత మంది వ్యక్తులపై దాడి చేసి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసును క్వాష్ చేయాలని కోరుతూ ఆర్ఎస్పీ హైకోర్టును ఆశ్రయించారు.
New Update
Advertisment