తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Telangana Elections 2023) సాగుతోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ 40కి మించి స్థానాలు సాధించే అవకాశం కనిపించడం లేదు. దీతో పాటు ఏడుగురు మంత్రులు ఓటమి దిశగా ఉన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురి - కొప్పుల ఈశ్వర్, మహబూబ్‌నగర్ - శ్రీనివాస్ గౌడ్, వనపర్తి - నిరంజన్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.
రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన కేసీఆర్ గజ్వేల్ లో గెలుపు దిశలో ఉండగా.. కామారెడ్డిలో మాత్రం మూడో ప్లేస్ లో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రెండు స్థానాల్లో విజయం దిశగా రేవంత్.. కామారెడ్డిలో కేసీఆర్ కు థర్డ్ ప్లేస్!