TS Congress: ఈ ముగ్గురే టార్గెట్.. రంగంలోకి రాహుల్, రేవంత్!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ మారిన ఇల్లందు, కొత్తగూడెం, పినపాక ఎమ్మెల్యేలను ఓడించడమే లక్ష్యంగా హస్తం పార్టీ స్కెచ్ వేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో రాహుల్, రేవంత్ రెడ్డి పర్యటలను ఉండేలా ప్లాన్ చేస్తోంది.

TS Congress: ఈ ముగ్గురే టార్గెట్.. రంగంలోకి రాహుల్, రేవంత్!
New Update

ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ (BRS) లో చేరిన వారిని ఓడించడంపై స్పెసల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీని దెబ్బకొట్టిన వారిని ఓడించి గుణపాఠం చెప్పాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేరుగా రంగంలోకి దిగినట్లు చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గతేడాది మెజార్టీ స్థానాలు గెలుచుకున్నా.. చివరికి భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య మాత్రమే మిగిలారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

దీంతో పార్టీ మారిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల దామోదర్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది హస్తం పార్టీ. ఇందులో భాగంగా రేగా టార్గెట్‌గా రేపు పినపాకలో రాహుల్‌ గాంధీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అయితే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో గెలిచి.. బీఆర్ఎస్ లో చేరారు. అయితే.. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉండడంతో పార్టీ గెలుపుకు ఢోకా లేదన్న భావనలో కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు.

ఇంకా.. కొత్తగూడెం, ఇల్లందులోనూ ప్రత్యేక పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంతుచూస్తానంటూ మొదటి నుంచి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేడర్ ను మోసం చేసిన వారిని రాజకీయ సమాధి చేయాలని రేవంత్ పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యాచరణకు దిగింది కాంగ్రెస్ పార్టీ.

#telangana-elections-2023 #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe