TS Election Results: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న #RevanthReddy.. సీఎం ఆయనేనా?

సోషల్ మీడియాలో #RevanthReddy ట్రెండ్ అవుతోంది. మరో వైపు రేవంత్ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని సంబరాలు స్టార్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట భద్రతను పెంచారు.

New Update
TS Election Results: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న #RevanthReddy.. సీఎం ఆయనేనా?

కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌ రేవంత్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. #RevanthReddy ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ మారింది. మరో వైపు రేవంత్ రెడ్డి ఇంటికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. పటాకులు కాల్చి సంబరాలు చేస్తున్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు.

కాంగ్రెస్ అగ్రనేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ తదితరులు లీడ్ లో ఉండడంతో సీఎం పదవికి ఆ పార్టీలో ఫుల్ పోటీ ఉండేఅవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే.. ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి సీఎం అవడం ఖాయమని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: TS Congress: నో హంగ్.. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్!

Advertisment
తాజా కథనాలు