TS EAMCET Counselling: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆదివారం (13-08-2023) నాటికి తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ వి వివిధ కంప్యూటర్ బ్రాంచుల్లో సీట్లు పెరగడంతో టాప్ - 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రం సీఎస్‌ఈ కోర్సుల్లో సీట్లు చాలా మిగిలిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 19,049 సీట్లు మిగిలిపోయాయి. మూడో విడత కౌన్సెలింగ్ (counseling) ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ మేరకు 19 వేల వరకు సీట్లు మిగిలిపోయినట్లు విద్యామండలి వెల్లడించింది.
CSE విభాగంలో మిగిలిపోయిన సీట్లు
కంప్యూటర్ సైన్స్ (computer science) ఇంజనీరింగ్ (engineering) విభాగంలో 3,034 సీట్ల వరకూ మిగిలిపోయాయి. ముందుగానే సివిల్, మెకానికల్ సీట్లను అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బ్రాంచీల్లో దాదాపు 7 వేల సీట్లకు కోత పడింది. కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సైతం సీట్లు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో మరో 7 వేల వరకు సీట్లు పెరిగాయి.
ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్
వివిధ కంప్యూటర్ బ్రాంచుల్లో (computer branch) సీట్లు భారీగా పెరగడంతో టాప్ కాలేజీల్లో (top colleges) సీట్లు వంద శాతం భర్తీ (recruit) అయ్యాయి. ఇక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు ముందుగానే సీట్ల సంఖ్యను (seat number) తగ్గించుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ (electronics), సివిల్ (civil), మెకానికల్ (mechanical) బ్రాంచీల్లో సీట్లు తక్కువగా ఉన్నాయి. అయితే వాటిలోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. దీంతో అన్ని సీట్లకు (august - 17) గురువారం నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ (special counselling) నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ (schedule) ను కూడా విడుదల (release) చేసింది.
Website: Tseamcet.nic.in
Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!