TS EAMCET Counselling: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆదివారం (13-08-2023) నాటికి తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ వి వివిధ కంప్యూటర్ బ్రాంచుల్లో సీట్లు పెరగడంతో టాప్ – 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రం సీఎస్ఈ కోర్సుల్లో సీట్లు చాలా మిగిలిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 19,049 సీట్లు మిగిలిపోయాయి. మూడో విడత కౌన్సెలింగ్ (counseling) ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ మేరకు 19 వేల వరకు సీట్లు మిగిలిపోయినట్లు విద్యామండలి వెల్లడించింది.
పూర్తిగా చదవండి..TS EAMCET Counselling: ఈనెల 17 నుంచి ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్
తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్ (CSE) కోర్సులే 56,811 ఉన్నాయి. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికి ఆగస్టు 17 నుంచి ఎంసెట్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
Translate this News: