తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి 35 మంది అభ్యర్థులతో బీజేపీ (BJP) మూడో లిస్ట్ ను విడుదల చేసింది. ఊహించిన విధంగానే కీలక నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ పేర్లు లిస్ట్ లో కనిపించలేదు. దీంతో వారు పోటీ చేయడం లేదన్న విషయం స్పష్టమైంది. మాజీ మంత్రి బాబూమోహన్ కు అందోలు టికెట్ ను కేటాయించింది బీజేపీ హైకమాండ్. తన టికెట్ విషయంపై స్పందించడం లేదని ఇటీవల బాబూ మోహన్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు కూడా.. ఇంకా కిషన్ రెడ్డి (Kishan Reddy) గతంలో గెలిచిన అంబర్ పేట సీటును మాజీ మంత్రి కృష్ణయాదవ్ కు కేటాయించారు. నారాయణ ఖేడ్ టికెట్ ను మాజీ జర్నలిస్ట్ సంగప్పకు (Sangappa) కేటాయించారు. మాజీ ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వత్థామరెడ్డికి వనపర్తి టికెట్ దక్కింది.
సనత్ నగర్ నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఈ సారి బాన్సువాడ నుంచి బరిలోకి దిగనున్నారు. గతంలో లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్ టికెట్ ను దత్తాత్రేయ కుమార్తెకు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ టికెట్ ను పూసరాజు కేటాయించింది బీజీపీ హైకమాండ్.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు
బీజీపీ మూడవ జాబితా:
- మంచిర్యాల-రఘునాథ్
- ఆసిఫాబాద్-ఆత్మారామ్ నాయక్
- బోధన్-మోహన్‌రెడ్డి
- బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ
- నిజామాబాద్ రూరల్-దినేష్
- మంథని-సునీల్ రెడ్డి
- మెదక్-విజయ్‌కుమార్
- నారాయణఖేడ్-సంగప్ప
- ఆందోల్-బాబుమోహన్
- జహీరాబాద్-రాజనర్సింహ
- ఉప్పల్-ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
- ఎల్బీనగర్-సామ రంగారెడ్డి
- రాజేంద్రనగర్-శ్రీనివాస్‌రెడ్డి
- చేవెళ్ల-కేఎస్ రత్నం
- పరిగి-మారుతీ కిరణ్,
- ముషీరాబాద్-పూసరాజు
- మలక్‌పేట్-సురేందర్‌రెడ్డి,
- అంబర్‌పేట్-కృష్ణయాదవ్
- జూబ్లీహిల్స్-దీపక్‌రెడ్డి
- సనత్‌నగర్-మర్రి శశిధర్‌రెడ్డి
- సికింద్రాబాద్-మేకల సారంగపాణి
- నారాయణ్ పేట్ - కె. రతంగ్ పాండు రెడ్డి
- జడ్చర్ల - చిత్తరంజన్ దాస్
- మక్తల్ - జలందర్ రెడ్డి
- వనపర్తి - అశ్వద్థామ రెడ్డి
- అచ్చంపేట్(ఎస్సీ) - దేవని సతీష్ మాదిగ
- షాద్ నగర్ - అందే బాబయ్య
- దేవరకొండ(ఎస్టీ) - కేతావత్ లాలూ నాయక్
- హుజూర్‌నగర్ - చల్లా శ్రీలత రెడ్డి
- నల్లగొండ - మదగాని శ్రీనివాస్ గౌడ్
- ఆలేరు - పడాల శ్రీనివాస్
- పరకాల - పి. కాళీ ప్రసాద్ రావు
- పినపాక (ఎస్టీ) - పొదియం బాలరాజు
- పాలేరు - నున్న రవికుమార్
- సత్తుపల్లి(ఎస్సీ) - రామలింగేశ్వర్ రావు