TS Teacher Jobs: టీచర్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!

తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

New Update
TS Teacher Jobs: టీచర్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!

Free Coaching For TS DSC 2024: తెలంగాణలో భారీగా టీచర్ ఉద్యోగాల (TS Teacher Jobs) భర్తీకి రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. కోచింగ్ కోరుకునే అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్ డైట్ టెట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి ఉచిత కోచింగ్ ఉంటుంది.
అప్లికేషన్ డైరెక్ట్ లింక్-LINK
Free Coaching For TS DSC 2024 publive-image

ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం-మార్చి 14
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ-మార్చి 22
ఎంపికైన అభ్యర్థుల లిస్ట్-మార్చి 23
కోచింగ్ ప్రారంభించే తేదీ-మార్చి 26

Advertisment
తాజా కథనాలు