White Nails Tips: గోర్లు తెల్లగా కావాలంటే ఇలా ట్రై చేయండి

జీవన శైలిలో మార్పులు, పోషకాహారం లోపం, హార్మోన్లలో మార్పుల వల్ల గోళ్లు సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన గోళ్లు చేతుల అందంతోపాటు మంచి ఆరోగ్యానికి సూచిస్తుంది. మహిళలు, పురుషుల్లో గోర్లు తెల్లగా కావలంటే వైట్ వెనిగర్, టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా, స్క్రబ్ వంటి వాటితో మారుతాయి.

White Nails Tips: గోర్లు తెల్లగా కావాలంటే ఇలా ట్రై చేయండి
New Update

మన గోళ్లపై చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాం. మన శరీరంలో విటమిన్- బి12 లోపం వలన గోళ్లు ఆరోగ్యంగా కనపడవు. గోళ్ళు తెల్లగా ఉంటే మరింత అందంగా ఉంచుకునేందుకు చాలామంది ట్రై చేస్తారు. ఆరోగ్యంగా, పొడుగ్గా ఉండే గోర్లంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. వీటిని కోసం అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చాలామందికి గోర్లు పొడుగ్గా పెరుగుతాయి. కానీ, రోజూ చేసే పనుల వల్ల నల్లగా మారతాయి. అలాంటి గోర్లను తెల్లగా మార్చాలంటే అందుకోసం కొన్ని టిప్స్ బాగా హెల్ప్ చేస్తాయి. కొబ్బరి నూనె గోర్లు కోసం సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ఆలివ్ నూనెలో ఉండే విటమిన్- ఇ. ఆరోగ్యకరమైన గోళ్లకు మేలు చేస్తుంది. మనం గోళ్లను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి? అవేంటో ఇప్పుడు కొన్ని ఇషయాలు తెలుసుకుందాం.

గోర్లు తెల్లగా ఉండాలంటే ఇలా చేయాలి:

వైట్ వెనిగర్: గోరువెచ్చని నీటిలో వైట్ వెనిగర్ వేసి గోర్లని ఉంచి నానిన తరువాత శుభ్రమైన టవల్‌తో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని కలిపి కాటన్ సాయంతో గోర్లపై రుద్దాలి.10 నిమిషాల తర్వాత గోరువెచ్చని ననీటితో క్లీన్ చేస్తే ఫలితం ఉంటుంది.

టూత్‌పేస్ట్: వైట్ టూత్‌పేస్ట్‌తో గోర్లపై మరకలు ఈజీగా పోతాయి. టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి గోర్లని సున్నితంగా స్క్రబ్ చేయాలి. గోర్లని మరకలు తగ్గాలంటే సిగరెట్ తాగడం, గ్లౌజెస్ వేసుకోవడం తగ్గించాలి.

బేకింగ్ సోడా, నిమ్మరసం: గోర్లని తెల్లగా చేయడంలో బేకింగ్ సోడా, నిమ్మరసం మంచిగా పనిచేస్తాయి. ఈ రెండు కలిపిన పేస్టును గోర్లపై 30 సెకన్ల పాటు రుద్ది 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

టీట్రీ ఆయిల్: టీట్రీ ఆయిల్‌ని గోర్లపై వేసి స్క్రబ్ చేయాలి. రెగ్యులర్‌గా ఇలా మీకు వీలున్నంత సేపు క్లీన్ చేస్తే ఉపయోగం ఉంటుంది.

స్క్రబ్: గోర్లని ఎప్పటికప్పుడు న్యూట్రలైజర్‌, నెయిల్ పాలిష్, నెయిల్ స్క్రబ్‌ బ్రష్‌ని వాడినా గోర్లపై మరకలు పోతాయి.

లెమన్ సాల్ట్: రోజూ నిమ్మ, ఉప్పు కలిపి స్క్రబ్ చేస్తే గోర్లు తెల్లగా ఉంటాయి. అందుకోసం నిమ్మరసం, ఉప్పు కలిపి పేస్టులా చేసి గోర్లపై కాసేపు ఉంచి క్లీన్ చేస్తే గోర్లు తెల్లగా మారతాయి.

ఇది కూడా చదవండి: బిర్యానీ ఆకులతో మీ ఇంట్లో ఇన్ని లాభాలున్నాయి తెలుసా...?

#tips #white-nails
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe