Canada Prime Minister: ఎట్టకేలకు భారత్‌ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!

సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada prime minister)  జస్టిన్ ట్రూడో (Justin trudo) భారత్(Bharat)  ని విడిచి స్వదేశం బయల్దేరారు.

New Update
Canada Prime Minister: ఎట్టకేలకు భారత్‌ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!

Justin Trudeau: సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada Prime Minister)  జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్ ని విడిచి స్వదేశం బయల్దేరారు. జీ 20 సమావేశాలకు (G20 Meeting) వచ్చిన ఆయన సమావేశాల తరువాత కెనడా బయల్దేరి వెళ్లే సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన సుమారు 36 గంటల పాటు భారత్ లోనే చిక్కుకుపోయారు.

జీ 20 సదస్సు (G20 Summit) లో పాల్గొనేందుకు తన కుమారుడు జేవియర్ తో కలిసి సెప్టెంబర్ 8న ట్రూడో ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అతను తన దేశానికి వెళ్లలేకపోయారు. వార్తా సంస్థ ANI ప్రకారం, విమానం మరమ్మతులు చేసే వరకు కెనడా ప్రతినిధి బృందం భారతదేశంలోనే ఉంటుంది. సమాచారం ప్రకారం, ప్రధాని తన హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరబోతున్నప్పుడు, తన విమానం కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం.

సుమారు 36 గంటలు కష్టపడిన నిపుణుల బృందం ఆయన విమానాన్ని ప్రయాణించడానికి అనుకూలంగా చేశారు. మ‌రోవైపు కెన‌డా నుంచి ట్రూడో కోసం బ‌య‌లుదేరిన బ్యాక‌ప్ విమానాన్ని లండ‌న్‌కు దారిమ‌ళ్లించారు. అయితే ఈ విమానాన్ని ఎందుకు వెనక్కి తిప్పారు అనే విషయం గురించి మాత్రం ఎవరూ వెల్లడించలేదు.

అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్, కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, ఇరు దేశాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ మద్దతుదారులు, భారతదేశానికి వ్యతిరేకంగా వారి కుట్ర గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ కార్యకలాపాలను ఆపివేయాలని, భారతదేశానికి వ్యతిరేకంగా నిరసనలను ఆపాలని భారతదేశం బ్రిటిష్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలను కూడా డిమాండ్ చేసింది.

ఈ అంశాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సీరియస్‌గా తీసుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ప్రధాని మోడీ మాటలు విన్నారు. అయితే ఈ విషయంలో ఆయన డిఫెన్స్‌గా కనిపించారు. ఖలిస్తానీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రిషి సునక్ భారత్‌కు హామీ ఇచ్చారు.

Also Read: ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

Advertisment
Advertisment
తాజా కథనాలు