TREI-RB : త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్.. తుది దశకు గురుకుల నియామకాలు గురుకుల నియామకాల ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో తుది ప్రక్రియ కోసం కసరత్తులు ప్రారంభించారు. By Naren Kumar 26 Dec 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TREI-RB Recruitment : గురుకుల నియామకాల(TREI-RB) ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 9వేల ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలను నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ(TREI-RB) ఓ మూడు విభాగాల్లో తప్ప మిగతా పరీక్షల కీ పేపర్లను కూడా విడుదల చేసింది. కొన్ని సాంకేతిక అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, నియామకాల తుది దశకు బోర్డు చర్యలు తీసుకుంటోంది. మరో నాలుగైదు రోజుల్లో కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశముంది. ఇది కూడా చదవండి: TSPSC: గ్రూప్-2 వాయిదా.. ఏ క్షణమైనా నిర్ణయం? 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా సర్టిఫికేట్లు పరిశీలించనున్నారు. గురుకులాల నియామకాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లోదాదాపు 54 రకాల ఉద్యోగాలున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి సంబంధిత నిర్వాహకులకు ముందుగా ట్రైనింగ్ ఇవ్వాలని గురుకుల బోర్డు నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఎల్‌బీనగర్ గురుకుల కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి సిబ్బందికి మార్గదర్శకాలను అందించనున్నారు. ఎలాంటి పొరపాట్లకూ అవకాశం లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియ నిర్వహించాలన్న ఆలోచనలో టీఆర్ఈఐఆర్బీ ఉంది. వెరిఫికేషన్ ప్రక్రియకు కావాల్సిన సర్టిఫికేట్లు, తదితర వివరాలను త్వరలోనే గురుకుల బోర్డు వెల్లడించనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రకటన జారీ చేయాలని టీఆర్ఈఐఆర్బీ భావిస్తోంది. #lb-nagar #treirb-recruitment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి