Trains: నెల రోజుల పాటు రైళ్లు బంద్‌!

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని కాజీపేట, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్‌, సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సుమారు నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.

New Update
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

Trains Cancelled: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని కాజీపేట (Kazipet), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (Kagaznagar) మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్‌, సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సుమారు నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. సాంకేతిక కారణాలతో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

కొన్నింటిని వేరే మార్గంలో మళ్లించారని, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తామని అధికారులు వివరించారు.

నెలపాటు రద్దైన రైళ్లు ఇవే...
కాజీపేట-కాగజ్‌నగర్ 17003 నంబరు టైన్‌ ఈ నెల 17 నుంచి జులై6 వరకు రద్దు చేశారు.

కాగజ్‌న గర్‌ ఎక్స్‌ప్రెస్‌...12757/58 రెండు వైపులా కూడా ఈ నెల 23 నుంచి జులై 6 వరకు రద్దు చేశారు.

చైన్నై-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌....12967 ఈనెల 23,25,30 , జులై 2,7 తేదీల్లో రద్దు చేశారు.

జైపూర్‌-చెన్నై జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 12968 ఈ నెల 21,23,28,30 , జులై 5న రద్దు చేశారు.

మైసూర్‌-జైపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ 12975 ఈనెల 27,29,జులై 4,6 తేదీల్లో రద్దు చేశారు.

యశ్వంత్‌పూర్‌-లక్నో 12539 ఈ నెల 26,జులై 3న రద్దు చేశారు.

లక్నో-యశ్వంత్‌పూర్‌ 12540 ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు చేశారు.

భాగ్‌మతి-మైసూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 12577 ఈ నెల 28 , వచ్చే నెల 5న రద్దు చేశారు.

బిలాస్‌పూర్‌-త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్‌ 22619 ఈ నెల 25, జులై 2 రద్దు చేశారు.

త్రివేండ్రం- బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌.. 22620 ఈ నెల 23,30 తేదీల్లో రద్దు చేశారు.

పాటలీపుత్ర-శ్రీమాత వైష్ణో 22352 ఈ నెల 21, 28 , జులై 5 తేదీల్లో రద్దు చేశారు.

శ్రీమాతా వైష్ణో- పాటలీపుత్ర...22352 ఈ నెల 24, జులై 1,8 తేదీల్లో రద్దు చేశారు..

Also Read: కటోరా తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటి…దానిని ఎలా తీసుకోవాలంటే!

Advertisment
తాజా కథనాలు