Vishaka: విహార యాత్రలో విషాదం, ఇద్దరు మృతి..!

అల్లూరి జిల్లా రంపచోడవరంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. ఐ.పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో స్నానం చేస్తుండగా ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. యువతి సుభర్జిని, యువకుడు మహమ్మద్ జబ్బిర్ రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు.

New Update
Vishaka: విహార యాత్రలో విషాదం, ఇద్దరు మృతి..!

Vishaka: రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు స్నేహితులు విహారయాత్ర కోసం అల్లూరి జిల్లాకు వెళ్లారు.  సంక్రాంతి సెలువుల సందర్భంగ విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. రంపచోడవరం మండలం ఐ.పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో స్నానాలకు దిగారు. అయితే, వారిలో ఇద్దరు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు.

Also Read: మహిళ ప్రాణం తీసిన జ్యోతిష్యం పిచ్చి.. ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

వెంటనే అప్రమత్తమైన స్నేహితులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారిద్దరూ దొరికారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు.. మృతులు యువకుడు మహమ్మద్ జబ్బిర్(18), యువతి సుభర్జిని(18) రాజమండ్రి కి చెందిన వారిగా గుర్తించారు.

Also Read: మీ పిల్లలు స్కూల్ కి వెళ్లి సేఫ్ గా రావాలంటే.. సైబరాబాద్ పోలీసుల 15 టిప్స్!

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం మండలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లి అనంత లోకాలకు వెళ్లారని రోధిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు