Crime News : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు.. ఆరుగురు గల్లంతు

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న ఉదయం వేటకు వెళ్ళిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.

New Update
Crime News : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు.. ఆరుగురు గల్లంతు

Vizag : విశాఖ ఫిషింగ్ హార్బర్(Visakha Fishing Harbor) లో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన మత్స్యకారుల(Fishermen) ఆచూకీ లభించకపోవడంతో బాధిత మత్స్యకార కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. నిన్న ఉదయం వేటకు వెళ్ళిన ఆరుగురు మత్స్యకారులు గత రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు.

Also Read : కడప పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. మనసు మార్చుకున్న ఆదినారాయణరెడ్డి!

చిన్నారావు కారి (45) , కారి నరేంద్ర (18), మైలపల్లి మహేష్ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చిన సత్తయ్య (55), వాసుపల్లి అప్పన్న(32) కోసం కోస్ట్ గార్డ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో సహా ఉన్నతాధికారులు హార్బర్ కు చేరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు