బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం, విద్యార్థిని అనుమానాస్పద మృతి..!!

New Update

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మరణించింది. ఈ ఘటన అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ విద్యార్థిని నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్సి అందించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మరణించిది. అయితే ఆమె ప్రమాదవ శాత్తు బిల్డింగ్ పై నుంచి జారి పడిందా లేదా ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tragedy in Basra iiit

కాగా మృతురాలు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖితగా గుర్తించారు. లిఖిత స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ గా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బిల్డింగ్ పై నుంచి జారి పడిన లిఖితకు మొదటగా హాస్టల్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నిర్మల్ కు తీసుకెళ్లాలంటూ సూచించడంతో నిర్మల్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు