Traffic Rules: మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరూ లేరని రెడ్ లైట్ క్రాస్ చేశారా? హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసు లేడని వెళ్లిపోయారా? కెమెరాలు లేవు కదా అని స్పీడ్ గా దూసుకుపోయారా? అంతెందుకు సింపుల్ గా ఒక్కటే ప్రశ్న.. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా? దీనికి సమాధానం అవును అయితే, చలాన్ల మోతకు రెడీ అయిపోండి. అదేంటీ.. నేను సిగ్నల్ క్రాస్ చేసిన దగ్గర పోలీసులు లేరు చలాన్ ఎలా వచ్చింది అని మీరు అనుకొనవసరం లేదు. సరికొత్త టెక్నాలజీ.. ట్రాఫిక్ పోలీసులు లేకుండానే ట్రాఫిక్ నియంత్రించేందుకు అందుబాటులోకి వచ్చేస్తోంది. నమ్మట్లేదా? అయితే, ఈ వివరాలు చదివేయండి..
Traffic Rules: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రాఫిక్ నిర్వహణ బాధ్యత కూడా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతోంది. వాహనాలకు చలాన్లు జారీ చేయడానికి, ట్రాఫిక్ వ్యవస్థను నిర్వహించడానికి భవిష్యత్ లో ట్రాఫిక్ పోలీసుల అవసరం ఉండదు. ఈ పనులన్నీ టెక్నాలజీ ద్వారానే జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించినట్లు సిక్కిం రవాణా శాఖ ప్రకటించింది. మే 25 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పుడు సిక్కిం రేపు మన రాష్ట్రం కూడా అదేపని చేస్తుంది. డౌట్ అవసరం లేదు.
Traffic Rules: ఈ AI-ఆధారిత వ్యవస్థను పరిచయం చేయడం ఉద్దేశ్యం ట్రాఫిక్ నిర్వహణను ఆధునీకరించడం. డాక్యుమెంట్స్ ను స్వయంచాలకంగా ధృవీకరించడం. అలాగే, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం ద్వారా నియంత్రణ వ్యవస్థను మెరుగుపరచడం. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను హైటెక్‌గా మార్చేందుకు, మరింత మెరుగుపరిచేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సిక్కిం రవాణాశాఖ చెబుతోంది. ఈ మేరకు ఆ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. నోటీసులో, వాహన యజమానులందరికీ వారి వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అప్‌డేట్ చేయమని చెప్పారు. ఈ-చలాన్ AI ద్వారా జనరేట్ అవుతుంది. అందులో ఏదైనా తేడా కనిపిస్తే దానిని SP దృష్టికి తీసుకురావచ్చు.
Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం!
దశల వారీగా..
Traffic Rules: నివేదికల ప్రకారం, మొదటి దశలో అక్కడి ప్రభుత్వం సిక్కిం అంతటా 16 ప్రదేశాలలో ఈ AI ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఆ తర్వాత పోలీసుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అదే ప్రాతిపదికన రెండో దశను ప్రారంభిస్తారు. మొదటి దశలో, గ్యాంగ్‌టక్‌లోని నాలుగు ప్రదేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు.
AI ట్రాఫిక్ విభాగంలో ఏ పనులు చేస్తుంది?
Traffic Rules: ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాల బీమా, పీయూసీ, ఫిట్‌నెస్, ఇతర పత్రాల్లో ఏదైనా లోపం కనిపిస్తే వాహనానికి సంబంధించిన ఈ-చలాన్ వస్తుంది. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్ ఆటోమేటిక్‌గా మోటారు వాహనాల పత్రాలను తనిఖీ చేస్తుంది. ఇది కాకుండా, ఈ వ్యవస్థ వారి నిర్దేశిత లేన్‌లో నడవని వాహనాలను పర్యవేక్షిస్తుంది. ఇది కాకుండా, ఇది రెడ్ లైట్ జంపింగ్, వేగ పరిమితి ఉల్లంఘనలపై కూడా నిఘా ఉంచుతుంది.