Bangalore Traffic : బెంగళూరులో నివాసం ఉండే వారికి అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

బెంగళూరులో శ్రీ ధర్మరాయస్వామి కరగ మహోత్సవాల నేపథ్యంలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. పలు మార్గాల్లో రాకపోకలు నిషేధించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూడొచ్చు.

New Update
Bangalore Traffic : బెంగళూరులో నివాసం ఉండే వారికి అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions : బెంగళూరు(Bangalore) లో శ్రీ ధర్మరాయస్వామి కరగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి 24 వరకు ఉదయం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు శ్రీ ధర్మరాయ స్వామి దేవాలయం(Sri Dharmaraya  Swamy Devasthanam) నుంచి ప్రారంభమై కబ్బన్‌పేట, నానిగరపేట, అవెన్యూ రోడ్డు మీదుగా కేఆర్ మార్కెట్ పోలీస్ స్టేషన్ రోడ్డులోని కోటే ఆంజనేయ దేవాలయం మీదుగా ఇతర మార్గాల్లో సాగుతుంది.

ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

- ఈ నేపథ్యంలో సిటీ మార్కెట్ సర్కిల్ నుంచి అవెన్యూ రోడ్డు మీదుగా మైసూర్ బ్యాంక్ సర్కిల్ వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు బెంగళూరు పోలీసులు
-ఎఎస్ చార్ వీధి నుండి సిటీ మార్కెట్ సర్కిల్ వైపు వాహనాల రాకపోకలపై ఆక్షలు విధించారు.
- SJP రోడ్డు నుండి PK లేన్ మీదుగా N.R స్క్వేర్ వైపు ఎడమవైపుకు వాహనాలను అనుమతించరు.
- ఊరేగింపు అవెన్యూ రోడ్డులోకి ప్రవేశించనుండడంతో మెడికల్ కాలేజీ వైపు నుంచి మార్కెట్ సర్కిల్ వైపు వాహనాల రాకపోకల బంద్ ఉంటుంది.

Also Read : పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే

ప్రత్యామ్నాయ మార్గాలివే..
- SJP రోడ్ నుంచి వాహనాలు టౌన్‌హాల్ వైపు వెళ్లి KG రోడ్‌ వద్ద ఎడమ మలుపు తీసుకోవచ్చు.
- వాహనాలు Ascher వీధిలో కుడివైపునకు తిరిగి బ్రియాండ్ సర్కిల్ మీదుగా రాయాన్ సర్కిల్‌కు చేరుకోవచ్చు.
- చామరాజ్‌పేట నుంచి ప్రొ.శివశంకర్ సర్కిల్ మీదుగా వాహనాలు జేసీ రోడ్డులోకి ప్రవేశించి టౌన్‌హాల్ వైపు వెళ్లవచ్చు.

పార్కింగ్:
కరగ ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం బన్నప్ప పార్క్, టౌన్ హాల్ మరియు BBMP మార్కెట్ కాంప్లెక్స్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. PK లేన్, OTC రోడ్, SP రోడ్, కబ్బన్‌పేట్ రోడ్, సున్నకల్ పేట్ రోడ్, SJP, సిటీ మార్కెట్ సర్కిల్, SJP రోడ్, అవెన్యూ రోడ్ మరియు AS చార్ స్ట్రీట్ నుంచి మార్కెట్ సర్కిల్‌తో సహా కొన్ని రోడ్లలో పార్కింగ్ నిషేధించారు.

Advertisment
Advertisment