/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-reddy-CM-1-1-jpg.webp)
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పబ్లిక్ గార్డెన్ వైపు నుంచి ఎల్బీ స్టేడియం వైపునకు వచ్చే వెహికిల్స్ ను నాంపల్లి వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా.. ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపును డైవర్ట్ చేస్తారు.
ఇది కూడా చదవండి: New CM Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారానికి ఆహ్వాన పత్రిక ఇదే!
Traffic advisory for swearing in ceremony of #RevanthReddy as CM at LB stadium for Thursday.@DeccanChronicle @oratorgreat @hydcitypolice @HYDTP @TelanganaCMO @revanth_anumula #Telangana pic.twitter.com/NzH81kSXEj
— Pinto Deepak (@PintodeepakD) December 6, 2023
ఇంకా బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపునకు మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు. దీంతో వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.