Traffic Diversion: పోటాపోటీ రాజకీయ కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. By BalaMurali Krishna 17 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Traffic Diversion: తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోన దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇది కూడా చదవండి: సర్దార్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించింది: అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్ల వైపు ఆంక్షలు విధించారు. టివోలి ఎక్స్-రోడ్స్ నుండి ప్లాజా ఎక్స్-రోడ్స్ మధ్య రోడ్డు మూసివేశారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లాలనుకునే ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా త్వరగా బయలుదేరాలని పోలీసులు సూచించారు. UPSC సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్/ఐడీ కార్డ్‌ని చూపిస్తే వారిని అనుమతించడం జరుగుతుందన్నారు. అలాగే చిలకలగూడ క్రాస్ రోడ్లు, ఆలుగడ్డ బాయి క్రాస్ రోడ్లు, సంగీత్ ఎక్స్ రోడ్స్, YMCA క్రాస్ రోడ్, పాట్నీ X రోడ్, SBH X రోడ్, ప్లాజా, CTO జంక్షన్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. వీటితో పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు 1. బ్రూక్‌బాండ్ జంక్షన్ 2. టివోలి జంక్షన్ 3. స్వీకర్ ఉపాకర్ జంక్షన్ 4. సికింద్రాబాద్ క్లబ్ 5. త్రిముల్‌గేరీ X రోడ్ 6. టాడ్‌బండ్ X రోడ్ 7. సెంటర్ పాయింట్ 8. డైమండ్ పాయింట్ 9. బోవెన్‌పల్లి X రోడ్ 10. రసూల్‌పురా, బేగంపేట్ ఇది కూడా చదవండి: తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి: కేసీఆర్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి