సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: మహేష్ గౌడ్

సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తెలిపారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ మీటింగ్‌లో స్క్రీనింగ్ కమిటి సభ్యులు మురళీధరన్, బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మెహాని పాల్గొన్నారు.

సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: మహేష్ గౌడ్
New Update

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.. 

సెప్టెంబర్ నెలలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తెలిపారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహం అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఈ మీటింగ్‌లో స్క్రీనింగ్ కమిటి సభ్యులు మురళీధరన్, బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మెహాని పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి విధివిధానాలు, రుసుముపై సబ్ కమిటీ ఏర్పాటుచేస్తామన్నారు.

సబ్ కమిటి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహా..

సబ్ కమిటి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహా, రోహిత్ చౌదరి, మహేష్ గౌడ్ సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు విదివిధానాలు ఖరారుచేశామన్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు డిడి రూపంలో రుసుము చెల్లించి అప్లికేషన్ ఇవ్వాలని తెలియజేశారు. టికెట్ ఆశించేవారు గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటి సమావేశం అవుతుందని వెల్లడించారు.

అభ్యర్థుల ఎంపికపై కమిటీదే తుది నిర్ణయం..

అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు క్రోడికరించి స్క్రీనింగ్ కమిటీకి సమర్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం కుదరదని.. పూర్తి స్థాయిలో సర్వేలు ఆధారం కాదని.. సర్వేలు కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై కమిటీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. సరైన అభ్యర్థిని పీఈసి, స్క్రీనింగ్ కమిటి, ఆ తరువాత సీఈసి, తరువాత సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటాయని తేల్చిచెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లు ప్రత్యేక కార్యాచరణతో దూసుకుపోతుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాలతో పాటు కేసీఆర్ (KCR)సర్కార్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంతనాలు జరిపారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగొలు సర్వేతో పాటు వివిధ సర్వే నివేదికలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎన్నికల కమిటీ సూచించిన అభ్యర్థులపై మరోసారి స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి దశ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతోంది. తొలి దశ జాబితాలను హైకమాండ్‌కు పంపంచి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ(BJP) కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించే దిశగా కార్యాచరణ రెడీ చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe