Jagga Reddy: కాంగ్రెస్ కూలిపోతోందని ఇందుకే అంటున్నారు.. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నవా?: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది త్వరలో కాంగ్రేస్ లో చేరతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోతోందని కేటీఆర్, హరీష్ అంటున్నారన్నారు.

Jagga Reddy: కాంగ్రెస్ కూలిపోతోందని ఇందుకే అంటున్నారు.. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నవా?: జగ్గారెడ్డి
New Update

Jagga Reddy Fired on KTR and Harish Rao: బీఆర్ఎస్ కు వారి ఎమ్మెల్యేలు చేజారిపోతారని భయం పట్టుకుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రేస్ లో చేరతారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ కూలిపోతోంది అని కేటీఆర్ (KTR)..హరీష్ రావు (Harish Rao) అంటున్నారన్నారు. పార్టీని కాపాడుకోవాలనే అలా కామెంట్స్ చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ సందిగ్ధంలో ఉందన్నారు జగ్గారెడ్డి.

Also Read: జనసేన నేత హత్యాయత్నం కేసులో ఊహించని ట్విస్ట్..!

ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిపై (Vijayasai Reddy) నిప్పులు చెరిగారు. బ్రోకర్ దుకాణం ఏదైనా పెట్టుకున్నవా? విజయసాయి రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నికేమైనా విలువలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్ళును విజయసాయి రెడ్డి మొక్కాడని అన్నారు. కేసీఆర్ (KCR) ని అదరగొట్టిన వ్యక్తి వైఎస్ అని.. అలాంటి వైఎస్ కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి ..కేసీఆర్ కాళ్ళు మొక్కుడు ఏంటని తనకే సిగ్గగా అనిపించిందన్నారు. మోడీ డైరెక్షన్ లోనే..కేసీఆర్.. జగన్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు.


Also Read: మేకపాటికి చేదు అనుభవం.. రసభసగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..!

ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. 12 నుండి 14 ఎంపీ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మీడియేటర్ విజయ సాయి రెడ్డి..కేటీఆర్..హరీష్ కుట్రలు తిప్పి కొడతామన్నారు. వీలైనంత త్వరలోనే 20 మంది ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లోకి (Congress) తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆట మొదలైంది.. చూసుకోండి అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ 15 లక్షలు పెంచారని..రూ. 500 కె సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీల నిర్ణయం మేరకు పథకాల అమలవుతున్నయన్నారు.

#jagga-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి