TPCC Revanth Reddy: కేసీఆర్‌ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా ఉంది. డెంగీ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు…వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR)ను డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy).

New Update
TPCC Revanth Reddy: కేసీఆర్‌ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి..!

TPCC Revanth Reddy:తెలంగాణ(Telangana) రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా ఉంది. డెంగీ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు…వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy).

రాష్ట్రంలో డెంగీ కేసులు మరింత పెరుగుతున్నాయి. గత ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. వర్షాల కారణంగా డెంగీ కేసులు మరింత పెరిగిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు.ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని వైద్యులు చెప్తున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.కాగా, ఇటీవల డెంగీతో ఖమ్మం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగీ జ్వరానికి కారణం 'ఎడిస్‌ ఈజిప్టి' దోమ అంటున్నారు వైద్యులు. ఈ దోమలు కుట్టడం వల్ల డెంగీ జ్వరం వస్తుందని తెలిపారు.ఎక్కువుగా నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పునరుత్పత్తి చేస్తుంది. అయితే,'ఎడిస్‌ ఈజిప్టి' దోమ పగటిపూటే కుడుతుంది. సో...ఎక్కడ కూడా నీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవాలి. మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతతో ఈ వ్యాధిని అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Advertisment
తాజా కథనాలు