Revanth reddy: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల దుమారం.. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత..! ఉచిత్ విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ అప్పట్లో కాంగ్రెస్‌లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ కోసం ఆయనకు తెల్వదన్నారు కోమటిరెడ్డి. ఉచిత విద్యుత్ కోసం ఎంత కష్టపడ్డామో తమకే తెలుసన్నారు. By Trinath 11 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్ నుంచి ఎలాగో వ్యతిరేకత రావడం సహజమేనైనా.. రేవంత్ సొంతపార్టీ నేతలు సైతం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రేవంత్ అంటే కాంగ్రెస్ కాదు అని.. కాంగ్రెస్ అంటే రేవంత్ కాదు అని క్లారిటీ ఇస్తున్నారు. 130ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మాటలను ఓన్ చేసుకోదని..అంతా పార్టీ కోసం పని చేసేవాళ్లమేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్‌కు ఉచిత విద్యుత్ అంశంపై క్లారిటీ లేనట్టు ఉందంటూ అభిప్రాయపడ్డారు. రేవంత్ ఏమన్నారంటే? తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై మాట్లాడుతూ 'తెలంగాణలో 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట విద్యుత్ చాలు. 3 ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు 3 గంటల విద్యుత్ చాలు. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే నినాదం తీసుకొచ్చారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నాం' అంటూ వ్యాఖ్యానించారు. ఆయనకేం తెలవదు: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఓవైపు బీఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగగా..ఇటు కాంగ్రెస్ సీనియర్లు సైతం దిద్దుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందరికంటే ముందుగా రియాక్ట్ అయ్యారు. రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదంటూనే మ్యానిఫెస్టోలో ఇలా చేస్తామని చెప్పే అధికారం టీపీసీసీ చీఫ్‌కి లేదన్నారు. దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్న విషయం మరువద్దన్నారు వెంకట్‌రెడ్డి. ఉచిత విద్యుత్ అందించేందుకు నాడు సోనియాను వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పించారని.. ఆ సమయంలో కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి లేరన్నారు. అప్పుడు వైఎస్సార్ ఎంత కష్టపడ్డరో రేవంత్‌రెడ్డికి తెలియదని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతామన్నారు. ఏ ఒక్కరో చెప్పినంతా మాత్రానా అవి మ్యానిఫెస్టోలో ఉండవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తానో..రేవంతో నిర్ణయించారని.. పార్టీ హైకమాండ్ చెప్పినట్టుగానే చేస్తామన్నారు వెంకట్‌రెడ్డి. డిఫెన్స్‌లో కాంగ్రెస్: నిజానికి వైఎస్ హయంలో రోజుకు 9గంటల ఉచిత విద్యుత్ వచ్చేది.. ఈ పథకం కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో పెద్ద ఎసెట్. అందుకే కేసీఆర్ కూడా అదే పథకాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. రోజుకు 24గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా బీఆర్‌ఎస్ తనను తాను జాతీయ లెవల్‌లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటిది రేవంత్‌రెడ్డి రోజుకు 8గంటలే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పడంతో హస్తం నేతలు డిఫెన్స్‌లో పడిపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్‌రెడ్డి హయంలోనే 9గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు..రేవంత్ ఓ గంట తగ్గించి చెప్పడంతో ఆ పార్టీ నేతలకు మీడియా అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అందుకే అమెరికా నుంచి రేవంత్ వచ్చిన వెంటనే ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ నిర్వహించాలని కాంగ్రెస్ డిసైడ్ ఐనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలూ ఉచిత విద్యుత్‌ను కోతల్లేకుండా నాణ్యమైనది సరఫరా చేస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రేపు బీఆర్‌ఎస్ నిరసలనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి