TS Politics: ఎర్రబెల్లి ద్రోహంతోనే నేను జైలుకు వెళ్లా.. పాలకుర్తి సభలో రేవంత్ సంచలన ఆరోపణలు

ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ద్రోహం కారణంగానే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దయాకర్ రావు కుట్రల కారణంగానే తెలంగాణలో టీడీపీ ఈ పరిస్థితికి వచ్చిందన్నారు.

TS Politics: ఎర్రబెల్లి ద్రోహంతోనే నేను జైలుకు వెళ్లా.. పాలకుర్తి సభలో రేవంత్ సంచలన ఆరోపణలు
New Update

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లడానికి దయాకర్ రావు (Dayakar Rao) చేసిన ద్రోహమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైల్లో ఉన్నా.. అంటే దానికి ఆయనే కారణమన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకర్ రావు కుట్రలే కారణమని ధ్వజమెత్తారు. శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి టీడీపీని దెబ్బకొట్టాడన్నారు. టీడీపీ అభిమానులంతా కలిసి వచ్చి దయాకర్ రావును రాజకీయంగా బొందపెట్టాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఈ రోజు పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Elections: మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018లో ఊసరవెళ్లి దయాకర్ రావును ఓడించాలని తాను అనుకున్నా.. తన గురి తప్పిందన్నారు. కానీ, 2023లో మాత్రం ఆయన ఓటమి ఖాయమన్నారు. రేషన్ డీలర్ గా జీవితం ప్రారంభించిన దయాకర్ రావు ఈ రోజు డాలర్ దయాకర్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆయనకు ఇన్ని వందల ఎకరాల భూములు, అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక

పాలకుర్తి ప్రాంతానికి పట్టిన శని దయాకర్ రావు అని నిప్పులు చెరిగారు. ఆ శనిని వదిలించడానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేస్తామన్నారు. ఎర్రబెల్లి వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు ఇక సాగవని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు.

#errabelli-dayakar-rao #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe