Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామ‌స్ థ్రిల్లర్ 'భార్గ‌వి నిల‌యం'

మలయాళ హీరో టోవినో థామ‌స్ హీరోగా నటించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ ‘నీల వెలిచం’. తెలుగులో 'భార్గ‌వి నిల‌యం' పేరుతో విడుదలైంది. ఈ చిత్రం దాదాపు ఏడాది తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామ‌స్ థ్రిల్లర్  'భార్గ‌వి నిల‌యం'
New Update

Bhargavi Nilayam:  మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా ఆషిక్ అబు తెరకెక్కించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ ‘నీల వెలిచం’. తెలుగులో ఈ చిత్రాన్ని భార్గవి నిలయం పేరుతో విడుదల చేశారు. గతేడాది ఏప్రిల్ 20న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.

అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు ఏడాది తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది.  ప్రస్తుతం ఈ సినిమా 'తెలుగు వెర్షన్ భార్గవి నిలయం' ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో సెప్టెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో టోవినో థామస్‌, రిమా కల్లింగల్, రోషన్, షైన్ టామ్ ప్రధాన పాత్రలో నటించగా.. రాజేశ్ మాధవన్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్, చెంబన్ వినోద్ జోస్, వెలియనాడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక థియేటర్స్ ఈ సూపర్ హిట్ థ్రిల్లర్ ను మిస్సైన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Devara Trailer: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో 'దేవర' ట్రైలర్..! - Rtvlive.com

#bhargavi-nilayam-ott #bhargavi-nilayam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe