/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-17-5-jpg.webp)
Tovino Thomas: 44 వ ఫాంటస్ పోర్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ వేడుకలో పోర్చుగల్ వేదికగా ఘనంగా జరిగాయి. 32 దేశాల నుంచి దాదాపు 90 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 షార్ట్ ఫిల్మ్‌లను ఈ అవార్డుకు నామినేట్ అయ్యాయి. ఈ వేడుకల్లో మలయాళ నటుడు టోవినో థామస్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. 'అదృశ్యం జలకంగళ్' సినిమాలో థామస్ నటనకు ఈ అవార్డు వరించింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు టోవినో.
Also Read: Anchor Rashmi: రష్మి ఇంట తీవ్ర విషాదం.. స్టార్ యాంకర్ కంట కన్నీరు😿
టోవినో ఇన్స్టాగ్రామ్ పోస్ట్
పోర్చుగల్‌లో జరిగిన ఫాంటాస్పోర్టో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డును పొందడం చాలా గౌరవంగా, గర్వంగా ఉంది. అంతర్జాతీయ వేదికగా ప్రతిభకు గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది. 'అదృశ్య జలకంగల్' సినిమా ఒక అద్భుతమైన చాఫ్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు అలాగే ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.
It’s great... to feel recognised. Extremely honoured and proud to have won the Best Actor award at the Fantasporto international Film Festival, in Portugal for ‘Adrishya Jaalakangal’. Being so far from your turf and still receiving such a warm welcome and acknowledgment for the… pic.twitter.com/BWnpqUMF2B
— Tovino Thomas (@ttovino) March 10, 2024
అదృశ్య జలకంగల్ చిత్రాన్ని బీ రాజు దర్శకత్వం వహించారు. యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని టాలిన్ బ్లాక్ నైట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా స్క్రీనింగ్ చేశారు.