పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు బాక్సర్లు!

పారిస్ ఒలింపిక్స్ లో 6 గురు బాక్సర్లు బరిలో దిగనున్నారు. వీరిలో ఇద్దరు పురుషులు,నలుగురు మహిళలు ఉన్నారు. ఆయితే వీరిలో తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయస్థాయిలో మెరుగైన ప్రదర్శన చేయటంతో ఆమె పై అంచనాలు పెరిగిపోయాయి.

New Update
పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు బాక్సర్లు!

పారిస్ ఒలింపిక్స్ లో 6 గురు బాక్సర్లు బరిలో దిగనున్నారు. వీరిలో ఇద్దరు పురుషులు,నలుగురు మహిళలు ఉన్నారు. మేరీకోమ్‌ శకం ముగియడంతో.. తమదైన ముద్ర వేయడానికి యువ బాక్సర్లకు ఇదో సువర్ణావకాశం లభించింది. ముఖ్యంగా మేరీ వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయిన తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. ఇంటర్నేషనల్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై భారీ అంచనాలు  పెరిగిపోయాయి . టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌ ఈసారి పతకం రంగుమార్చాలన్న పట్టుదలతో ఉంది. అమిత్‌ పంగల్‌, నిషాంత్‌ దేవ్‌ కూడా సత్తా చాటాలనుకొంటున్నారు. దీంతో వీరంతా పారిస్ లో బంగారు పతకాల పైనే దృష్టి ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు