వ్యాయామానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కోసం చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. వ్యాయామం అంటే కేవలం జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేయడమే కాదు శారీరక,మానసిక ఒత్తిడిని కూడా మెరుగుపరుచుకోవటం. వ్యాయామం ప్రారంభించే ముందు పాటించవలసిన కొన్ని విషయాలను ఇక్కడ వివరంగా చూద్దాం.

New Update
వ్యాయామానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

అతిగా తినడం మానుకోండి : వర్కవుట్‌కు ముందు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. వర్కవుట్ చేసే ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణకోశంలో అసౌకర్యం కలుగుతుంది, మీరు నిదానంగా కనిపిస్తారు. ఫలితంగా, మీ వ్యాయామం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే మీరు అలసిపోతారు. కాబట్టి వ్యాయామానికి 2-3 గంటల ముందు సమతులాహారం తీసుకోవడం మంచిది.

కెఫిన్ తీసుకోవడం తగ్గించండి: కాఫీ వంటి కెఫిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శక్తిని పెంచి వ్యాయామాన్ని ప్రోత్సహిస్తారని చాలా మంది నమ్ముతారు. అయినప్పటికీ, ఎక్కువ కెఫీన్ ఉన్న పధార్థాలు తీసుకోవటంవల్ల హార్ట్ రేటు పెరిగి గుండెపోటుకు దారి తీయోచ్చు. కెఫిన్ మీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి వ్యాయామానికి కనీసం ఒక గంట ముందు మితమైన కెఫిన్ తీసుకోవడం మంచిది.

ఆల్కహాల్ మానుకోండి : వ్యాయామం చేసేవారు మద్యానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ శరీర ఎనర్జీని దెబ్బతీస్తుంది. డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఫలితంగా వర్కవుట్ చేయలేక శరీరం అలసిపోతుంది. కాబట్టి మద్యం సేవించడం మానుకోండి.

హైడ్రేటెడ్‌గా ఉండండి: ఏదైనా పని చేయడానికి మన శరీరానికి తగినంత నీరు అవసరం. మీ శరీరం సరిగ్గా హైడ్రేట్ కాకపోతే వ్యాయామ గాయాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల, రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. మీ వ్యాయామం తర్వాత డిటాక్స్ వాటర్ లేదా నిమ్మరసం తాగడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు